నవోదయ ఆన్లైన్ క్లాసెస్ 1-సెప్టెంబర్- 2024నుండి ప్రారంభమగును. 9491178120 కాల్ చేసి మీ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు

Gurukula

గురుకుల పాఠశాలలు ఎంట్రన్స్ టెస్ట్ (GPCET)

 ఏపీలోని ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల (5 th class admissions)కు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్రంలోని 36 సాధారణ, 12 మైనారిటీ గురుకులాలతోపాటు 2 రీజనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (ఆర్‌సీఈ) – తాడికొండ, కొడిగెనహళ్లి బాలుర పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

ప్రతి గురుకుల పాఠశాలలో 80 సీట్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని పీలేరు పాఠశాల, కర్నూలు మైనారిటీ బాలుర పాఠశాలల్లో ఒక్కోదానిలో 40 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ స్కూళ్లలో సీట్లకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఎంట్రన్స్ టెస్టు నిర్వహించి అందులో సీటు సాధించిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. పాత జిల్లాల ప్రకారం పాఠశాలలు కేటాయిస్తారు. ఇక్కడ ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది.

 

➤ అర్హత: 

 బాల బాలికలు వయస్సు 9-11 సంవత్సరాలు ఉండాలి సొంత జిల్లాలో ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన గ్రామీణ పాఠశాలల్లో మూడు, నాలుగు తరగతులు చదివి ఉండాలి. రిజర్వుడు వర్గాలకు చెందిన విద్యార్థులు పట్టణాల్లో చదివినా అప్లయ్‌ చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000లకు మించకూడదు. లేదా తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు. 

 

☛ AP రాష్ట్ర ప్రభుత్వం యొక్క IV తరగతి రాష్ట్ర సిలబస్ ఆధారంగా తెలుగు, ఇంగ్లీష్, గణితం మరియు పర్యావరణ శాస్త్రం సబ్జెక్టులలో ప్రవేశ పరీక్ష జరుగుతుంది.

ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు)లో ఉంటాయి మరియు ఇంగ్లీష్/తెలుగు/ఉర్దూ మీడియంలో ఉంటాయి. జిల్లాలోని ఎంపిక చేసిన కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

విద్యార్థులు రాష్ట్రంలో తమ సౌలభ్యం మేరకు ఏదైనా ఒక కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.

పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

దరఖాస్తు ఫీజు: రూ.50

 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:

 https://aprs.apcfss.in/ 
 
× How can I help you?