భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం కేంద్రప్రభుత్వం నడుపుతున్న పాఠశాల. ఈ పాఠశాలలను భారత ప్రభుత్వానికి చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ, విద్యామంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నవోదయ విద్యాలయ సమితి అనే స్వతంత్ర సంస్థ నిర్వహిస్తుంది. జెఎన్వీలు గురుకుల పాఠశాల పద్ధతిలో, బాల బాలికలకు విద్యనందిస్తాయి. ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అనుసంధానంతో, ఆరో తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్మీడియట్ ఆఖరి సంవత్సరం) వరకు ఉచితంగా చదువు చెప్తారు.
➤ జేఎన్వీల్లో ఆరవ తరగతి ప్రవేశానికి జేఎన్వీఎస్టీలో (JNVST) ఉత్తీర్ణత సాధించడం అవసరం, జేఎన్వీఎస్టీ సిబిఎస్సి ద్వారా రూపొందించబడి, నిర్వహించబడే ప్రవేశ పరీక్ష.ప్రతి జేఎన్వీ కోసం 80 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేయడానికి దేశవ్యాప్తంగా ఏటా ఆరవ తరగతి జేఎన్వీఎస్టీ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు కేవలం ఒక్కసారి మాత్రమే తమ V తరగతిలో పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
☛ ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరుగా వసతి, విద్య సదుపాయాలుంటాయి.
☛ అర్హత: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో 5వ తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత స్కూళ్లలోనే చదివి ఉండాలి. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు మరియు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.
➤ వయసు 10 నుండి 12 సంవత్సరాల మధ్య ఉండాలి
➤ ప్రవేశ పరీక్ష:
మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు సెక్షన్ల నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాయొచ్చు పరీక్ష సమయం 2 గంటలు. నెగిటివ్ మార్కులు లేవు.
➤ సెక్షన్-1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT) నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 50 మార్కులు ఉంటాయి. దీనికి ఒక గంట సమయం కేటాయించారు. ఈ సెక్షన్లో మొత్తం 10 విభాగాలుంటాయి. ఒక్కో దాంట్లో నాలుగేసి చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
సెక్షన్-2లో అరిథ్మెటిక్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. 30 నిమిషాల్లో ఈ సెక్షన్ పూర్తిచేయాల్సి ఉంటుంది.
☛ సెక్షన్-3 అనేది లాంగ్వేజ్ టెస్ట్. ఇందులో 20 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. లాంగ్వేజ్ టెస్టులో పాసేజ్ ఇచ్చి, ప్రశ్నలకు సమాధానాలు రాయమంటారు. విద్యార్థులు పాసేజ్ అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకునేలా ఈ ప్రశ్నలు వస్తాయి. ప్రతి పాసేజ్ కింద అయిదేసి ప్రశ్నల చొప్పున నాలుగు పాసేజ్లు ఉంటాయి.
☛ దరఖాస్తు విధానం: ఆన్లైన్లో జేఎన్వీ అధికారిక వైబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని అప్లోడ్ చేయడం తప్పనిసరిని. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్ వివరాలు/ నివాస ధ్రువపత్రాల అవసరం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.
☛ సంబంధిత జిల్లాలో ఎంపిక చేసిన అన్ని కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తారు.
పూర్తి వివరాలకు వెబ్సైట్: