నవోదయ ఆన్లైన్ క్లాసెస్ 1-సెప్టెంబర్- 2024నుండి ప్రారంభమగును. 9491178120 కాల్ చేసి మీ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు

Sainik

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ (AISSEE)

స్కూల్‌ స్థాయి నుంచే సైన్యంలో చేరేలా సన్నద్ధం చేసే వేదికలు.. సైనిక్‌ స్కూల్స్‌! భావి భారత పౌరులు భద్రతా దళాల్లో అడుగుపెట్టి.. దేశ సేవ చేసేలా బడిలోనే శిక్షణ ఇస్తాయి. సైనిక పాఠశాలలు! అందుకే సైనిక్‌ స్కూల్స్‌లో తమ పిల్లలను చేర్పించాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఆశిస్తుంటారు !

సైనిక్‌ స్కూల్స్‌.. దాదాపు అయిదు దశాబ్దాల క్రితం ఏర్పాటైన విద్యా సంస్థలు. వీటి పర్యవేక్షణకు.. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైనిక్‌ స్కూల్‌ సొసైటీని నెలకొల్పారు. ఈ స్కూల్స్‌ ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధన సాగిస్తున్నాయి. చదువుతోపాటు విద్యార్థులకు ధైర్య సాహసాలు నూరిపోస్తూ.. త్రివిధ దళాల్లో వారు చేరేలా శిక్షణ ఇస్తున్నాయి.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో 33 సైనిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆరో తరగతిలో 2,894 సీట్లు, తొమ్మిదో తరగతిలో 379 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు 2023–24 విద్యా సంవత్సరం నుంచి పీపీపీ విధానంలో కొత్తగా మరో 18 సైనిక్‌ స్కూల్స్‌ ప్రారంభిస్తున్నారు. వీటిలో 1,590 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
➤ అదే విధంగా 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతిలో అమ్మాయిలకు కూడా ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. ప్రతి సైనిక్‌ స్కూల్‌లో 10 సీట్లను విద్యార్థినులకు కేటాయించారు. తొమ్మిదో తరగతికి మాత్రం పురుష అభ్యర్థులనే అర్హులుగా పేర్కొన్నారు.

అర్హతలు ఇవే..
☛ ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఏదైనా పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి. వయస్సు 10 నుంచి 12ఏళ్ల మధ్య ఉండాలి.
☛ తొమ్మిదో తరగతిలో చేరాలనుకుంటున్న విద్యార్థులు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతుండాలి. వయస్సు 13 నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉండాలి.

➤ ఆంధ్రప్రదేశ్‌లో కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ఆరో తరగతిలో 68 సీట్లు, తొమ్మిదో తరగతిలో 22 సీట్లు, కలికిరిలో ఆరో తరగతిలో 70 సీట్లు, తొమ్మిదో తరగతిలో 30 సీట్లు ఉన్నాయి.
➤ పీపీపీ విధానంలో.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో అదానీ వరల్డ్‌ స్కూల్‌ అందుబాటులోకి రానుంది. ఇందులో మొత్తం 50 సీట్లు ఉన్నాయి.
➤ ఏపీలోని సైనిక్‌ స్కూల్స్‌కు ఏపీ, తెలంగాణ విద్యార్థులు పోటీ పడొచ్చు.
అర్హతలు ఇవే..
☛ ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఏదైనా పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి. 10 నుంచి 12ఏళ్ల మధ్య ఉండాలి.
☛ తొమ్మిదో తరగతిలో చేరాలనుకుంటున్న విద్యార్థులు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతుండాలి.
13 నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉండాలి.
రాత పరీక్ష ఇలా..

☛ ప్రభుత్వ సైనిక్‌ స్కూల్స్‌తోపాటు, పీపీపీ విధానంలోని సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు సీట్లు ఖరారు చేస్తారు.
☛ ఎన్‌టీఏ ఆధ్వర్యంలో ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆరు, తొమ్మిది తరగతులకు వేర్వేరుగా ఉంటుంది.
☛ ఏఐఎస్‌ఎస్‌ఈఈలో సాధించిన ప్రతిభ, విద్యార్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న పాఠశాలల ప్రాథమ్యాల ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందించి ప్రవేశం ఖరారు చేస్తారు.

ఆరో తరగతి పరీక్ష విధానం ఇదే..
సైనిక్‌ స్కూల్స్‌లో ఆరో తరగతిలో ప్రవేశానికి మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 125 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు–50 మార్కులు,
మ్యాథమెటిక్స్‌ 50 ప్రశ్నలు–150 మార్కులు, ఇంటెలిజెన్స్‌ 25 ప్రశ్నలు–50 మార్కులు,
జనరల్‌ నాలెడ్జ్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. మ్యాథమెటిక్స్‌ విభాగంలో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు, మిగతా విభాగాల్లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.

తొమ్మిదో తరగతి పరీక్ష మాత్రం..

తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్షను మొత్తం నాలుగు వందల మార్కులకు అయిదు విభాగాల్లో నిర్వహిస్తారు. ఇందులో 150 ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటిక్స్‌ 50 ప్రశ్నలు–200 మార్కులకు, ఇంటెలిజెన్స్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు, ఇంగ్లిష్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు, జనరల్‌ సైన్స్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు, సోషల్‌ సైన్స్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. n మ్యాథమెటిక్స్‌ విభాగంలో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు, మిగతా విభాగాల్లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

భద్రతా దళాల్లో.. సైనిక్‌ స్కూల్స్‌ విద్యార్థులు..

సైనిక్‌ స్కూల్స్‌ అందించే శిక్షణ ఫలితంగా.. ఈ పాఠశాలల నుంచి త్రివిధ దళాల్లో చేరే వారి సంఖ్య కొంత ఎక్కువగా ఉంటోందని చెప్పొచ్చు. ఎన్‌డీఏ పరీక్ష ద్వారా ప్రతి ఏటా ఎంపికయ్యే వారిలో 30 శాతం వరకు సైనిక్‌ స్కూళ్ల విద్యార్థులే ఉంటున్నారు. స్కూల్‌ స్థాయి నుంచే శిక్షణనివ్వడం, ఎన్‌సీసీ, ఇతర ఫిజికల్‌ ట్రైనింగ్‌ యాక్టివిటీస్‌ ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

ముఖ్య సమాచారం ఇదే.. :
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఏఐఎస్‌ఎస్‌ఈఈ పరీక్ష తేదీ:
జనవరి లో
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్‌
వెబ్‌సైట్‌:

https://aissee.nta.nic.in, 
www.nta.ac.in
× How can I help you?